నెల్లూరు జిల్లాపై టీడీపీ ప్రత్యేకంగా గురి పెట్టింది. అభ్యర్థులను చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. నగరం నుంచి మంత్రి పొంగూరు నారాయణను బరిలో దింపాలని నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు నియోజకవర్గంలో మూడు ముక్కలుగా ఉన్న పార్టీని ఒక్కతాటిపైకి తీసుకురావటంలో మంత్రి విజయం సాధించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని అన్ని వర్గాలు ఆమోదించటంతో మొదటి సారి నగర నియోజకవర్గంలో పాజిటివ్ వేవ్ సాధించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్‌కుమార్ ఓ వీధి రౌడీలా వ్యవహరిస్తూండటంతో.. ఆయన ఎమ్మెల్యే ఏమిటన్న భావన అందరిలో ఏర్పడింది.
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి ఆదాల ప్రభాకరరెడ్డిని బరిలో దించటంతో వైకాపా నేతల్లో ఆందోళన చోటుచేసుకుంది. గతంలో పార్టీని వీడిన నేతలు క్రమేణా మళ్లీ తిరిగి వస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి దీటుగా ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తిని అనుకూలంగా మలచుకుంటూ.. రానున్న ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితుల్లోనూ విజయం సాధించే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో తెదేపాకు బలమైన అభ్యర్థి లేరంటూ ప్రచారం జరిగింది. బొల్లినేని కృష్ణయ్యను బరిలో దించటం.. జడ్పీ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ ధనుంజయరెడ్డి, కన్నబాబును సహకరించే విధంగా రాష్ట్ర పార్టీ వ్యూహాన్ని రూపొందించింది. అనూహ్యంగా తెదేపా బలం పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డికి తీవ్ర పోటీ ఎదురైంది. కావలి నియోజకవర్గంలో వైకాపాలో ఉన్న అసంతృప్తిని తెదేపా అనుకూలంగా మార్చుకుంది. వైకాపాలో బలమైన నేతలుగా ఉన్న విష్ణువర్థన్‌రెడ్డి, ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి పార్టీని వీడారు. వారిని తెదేపా వైపు తీసుకురావటంతో నేతలు విజయం సాధించారు.వేల సంఖ్యలో ఓటర్లను ప్రభావితం చేసే నేతలు తెదేపాకు అనుకూలం కావటంతో కావలిలో పార్టీ విజయావకాశాలు పెరిగాయి. ఎన్నికల ప్రకటన వెలువడినా జిల్లాలోని ఉదయగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరు అనే దానిపై పార్టీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
ఒకట్రెండు రోజుల్లో దీనిపై ఒక నిర్ణయాన్ని పార్టీ వెలువరిస్తుందని సమాచారం. రెండు చోట్ల కొత్త వారికి అవకాశం కల్పిస్తుందా? పాత ముఖాలనే తెరపైకి తీసుకువస్తుందా? అనే ఉత్కంఠ పార్టీలో నెలకొంది. ఇదే సమయంలో నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి ఎవరిని బరిలో దించాలనే దానిపై ఇంకా మల్లగుల్లాలు జరుగుతున్నాయి. పార్లమెంటు స్థానానికి సంబంధించి రెండు పార్టీల్లోనూ సందిగ్ధత నెలకొనటం గమనార్హం. వైకాపా తరఫున మేకపాటి రాజమోహన్‌రెడ్డి బరిలో ఉంటారని భావిస్తున్నారు. ఆఖరు క్షణంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ వైకాపా వర్గాల్లో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa