ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీతికథల చందమామపై అవినీతి ఆరోపణలు..

national |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 06:49 PM

నీతి కథల పత్రిక చందమామ కొత్త యాజమాన్యం మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటోంది. 2007లో ఈ పత్రికను ముంబయికి చెందిన జియోడెసిక్‌ లిమిటెడ్‌ కొనుగోలు చేసింది. తాజాగా ఈ కంపెనీలోని ముగ్గురు డైరెక్టర్లు స్విట్జర్లాండ్‌కు నిధులను తరలించినట్లు , ఇతర ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జియోడెసిక్‌ సంస్థ ఇప్పటికే సెబీ నుంచి పలు ఆంక్షలను ఎదుర్కొంటోంది. ఆగస్టు 2014 నుంచి ఈ సంస్థ షేరు ట్రేడింగ్‌ను నిలిపివేశారు. అప్పటికే దీని ధర బాగా కుంగిపోయింది. దీనిపై ఈడీ, ఎకనమిక్‌ అఫెన్స్‌ వింగ్‌, ముంబయి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మార్చి 5వ తేదీన స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెడరల్‌ ట్యాక్స్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ (ఎఫ్‌టీఏ) విభాగం ‘అడ్మిన్‌స్ట్రేటీవ్‌ అసిస్టెన్స్‌’ అందించేందుకు అంగీకరించింది.  దీనిపై అప్పీల్‌కు వెళ్లాలనుకుంటే 30 రోజుల గడువు ఉంటుంది.
జియోడెసిక్‌ ముగ్గురు డైరెక్టర్లు (పంకజ్‌ కుమార్‌ ఓంకార్‌ శ్రీవాస్తవ, ప్రశాంత్‌ శారద్‌ ములెకర్‌, కిరణ్‌ కులకర్ణి) ఉన్నారు. దర్యాప్తులో స్విస్‌ ఖాతాలకు సంబంధించిన సమాచారం విషయంలో సహకారం అందిస్తామని ఇప్పటికే స్విస్‌ ప్రభుత్వం వెల్లడించింది. గతంలో కూడా ఇలాంటి నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లారు. ఇప్పడు మళ్లీ స్విస్‌ ఎఫ్‌టీఏ అటువంటి నిర్ణయమే తీసుకొంది.
తాజాగా ఈ కంపెనీతోపాటు చెన్నైకి చెందిన ఆది ఎంటర్‌ప్రైజెస్‌ కూడా ఇటువంటి ఆరోపణలనే ఎదుర్కొంటోంది. ఈ కంపెనీకి సంబంధించి కూడా స్విస్‌ ప్రభుత్వం సమాచారాన్ని పంచుకొనేందుకు సిద్ధమైంది.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa