రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. నాయకుల తీరు ఎలా ఉంటుందో? ఎప్పుడు ఎటు వైపు మొగ్గు చూపుతారో? వంటి కీలక అంశాలు తాజాగా తెరమీదికి వస్తున్నాయి. ఎన్నికలకు సమయం సమీపిస్తుండడం, నాయకు లు ఎక్కడికక్కడ గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండడం ఆసక్తిగా మారింది. అయితే, ఈ క్ర మంలోనే కొందరు చెంచా నాయకులు… పార్టీలను అడ్డం పెట్టుకుని రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు. ఇలాంటి వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన పాలేటి రామారావు ఒకరు. ఇక్కడ ఆయన ఇప్పుడు తురుపు ముక్కగా మారాడనే చర్చ సాగు తోంది. ప్రకాశం జిల్లా టీడీపీ నాయకుడిగా చలామణి అవుతూనే.,. ఆ పార్టీకి వెన్ను పోటు పొడిచేందుకు పాలేటి సిద్ధమ య్యారని అంటున్నారు.
ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్.,. తర్వాత కాలంలో టీడీపీ తీర్థం పుచ్చుకోవడం అంతా సంపాయించుకున్నాక ఇప్పుడు వైసీపీ పంచన చేరిపోవడం తెలిసిందే. అయితే, ఇంతలోనే తెరమీదికి వచ్చిన పాలేటి రామారావు. పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అయితే, ఇవన్నీ కూడా పూర్తిగా తన స్వార్థం కోసం చేస్తున్నవేనని అంటు న్నారు పరిశారు. పాలేటి రాజకీయ జీవితాన్ని దగ్గరగా పరిశీలిస్తే.. చాలా కీలకమైన విషయాలు తెరమీదికి వస్తున్నాయి.పాలేటికి ఒక పార్టీ అంటూ లేదు. అన్నగారి హయాంలో టీడీపీలో ప్రారంభమైన రాజకీయం తర్వాత లక్ష్మీపార్వతి పెట్టి న ఎన్టీఆర్ టీడీపీలోకి మళ్లింది. అక్కడ కొన్ని రోజుల తర్వాత .. మళ్లీ టీడీపీలోకి చేరిపోయారు పాలేటి. మళ్లీ 2009లో చి రంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతోనే పాలేటి చంద్రబాబుకు జై కొట్టారు. ఇక, తర్వాత ఆపార్టీ పనికూడా అయిపోవ డంతో వైసీపీలోకి చేరిపోయారు. గత ఎన్నికల్లో ఎడం బాలాజీ పుట్టిముంచి.. ఎన్నికల రిజల్ట్ వస్తున్న క్రమంలో టీడీపీ లోచేరిపోయిన పాలేటి.. ఒక్కపార్టీ పట్ల కూడా నిబద్ధతతో వ్యవహరించింది లేదు.
ఇక, ఇప్పుడు టీడీపీలోనే ఉంటూ.. ఆ పార్టీ పుట్టిముంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమంచి నుంచి డబ్బుల మూటలు అందుకున్న రామారావు.. టీడీపీని భ్రష్టు పట్టించడమే ధ్యేయంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే కొంత ముట్టిందని, ఎన్నికల సమయానికి మరికొంత ముడుతుందని అంటున్నారు. మొత్తానికి సొంత పార్టీకే కన్నం పెట్టే పాలేటి వంటి నాయకులను ఉపేక్షించరాదంటూ తమ్ముళ్లు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa