ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం..

national |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 07:50 PM

ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులు 2019 ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. మొత్తం 112 మంది విజేతల్లో ఈరోజు 56 మందికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పురస్కారాలు అందించారు. రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కాగా, మిగిలినవారికి ఈనెల 16న జరిగే తదుపరి కార్యక్రమంలో పురస్కారాల ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తదితరులు హాజరయ్యారు.
పురస్కారాలు అందుకున్నవారు వీరే..
చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ద్రోణవల్లి హారిక పద్మశ్రీ
ప్రముఖ జర్నలిస్టు కుల్‌దీప్‌ నయ్యార్‌(మరణానంతరం- పద్మభూషణ్‌, ఈ అవార్డును ఆయన భార్య భారతి నయ్యర్‌ అందుకున్నారు)
నటుడు మోహన్‌లాల్‌ పద్మభూషణ్‌
సంగీత దర్శకుడు శంకర్‌ మహదేవన్‌ పద్మశ్రీ
రెజ్లర్‌ భజరంగ్‌ పునియా పద్మశ్రీ
కబడ్డీ ఆటగాడు అజయ్‌ ఠాకూర్‌ పద్మశ్రీ
నటుడు ప్రభుదేవా పద్మశ్రీ
సర్దార్‌ సుఖ్‌దేవ్‌ సింగ్‌ దిల్సా పద్మభూషణ్‌
హకుందేవ్‌ నారాయణ్‌ యాదవ్‌ పద్మభూషణ్‌
విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుబ్రమణ్యం జయశంకర్‌ పద్మశ్రీ
టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు శరత్‌ కమల్ పద్మశ్రీ






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa