భారతదేశంలో క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025, మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. 2 నెలలకుపైగా సాగే ఈ లీగ్ క్రికెట్‌ను డిజిటల్ వేదికగా కోట్లాది మంది చూస్తుంటారు. ఈ మెగా టోర్నమెంట్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో చూడాలనుకునే వారి కోసం జియోహాట్‌స్టార్ అవకాశం కల్పిస్తుందన్న సంగతి తెలిసిందే. క్రికెట్ ప్రేక్షకుల కోసం ప్రముఖ టెలికాం కంపెనీలు.. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రత్యేకమైన జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ డేటా ప్లాన్లు అందుబాటులోకి తెచ్చాయి. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జియో ఐపీఎల్ 2025 స్పెషల్ ప్లాన్స్
రూ. 100తో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీతో 5 జీబీ డేటా, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసిన వినియోగదారులకు కూడా ఉచితంగా ఐపీఎల్ 2025 చూసే అవకాశం లభిస్తుంది. ఈ ఆఫర్ మార్చి 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్లు జియో అధికారిక వెబ్‌సైట్‌లో (MyJio App) అందుబాటులో ఉన్నాయి.
ఎయిర్ టెల్ ఐపీఎల్ 2025 స్పెషల్ ప్లాన్స్
రూ. 100 ప్లాన్‌తో 5జీబీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ, జియోహాట్‌స్టార్ r సబ్‌స్క్రిప్షన్ వస్తుంది. రూ. 195 ప్లాన్‌తో 90 రోజుల వ్యాలిడిటీ, 15జీబీడేటా, 90 రోజుల జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
వడా ఫోన్ ఐడియా (Vi)ఐపీఎల్ 2025 స్పెషల్ ప్లాన్స్
రూ. 101 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీ, 3జీబీ డేటా, 90 రోజుల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ వస్తుంది. రూ. 151తో రీఛార్జ్ చేసుకుంటే.. 30 రోజుల వ్యాలిడిటీ, 4జీబీ డేటా, 90 రోజుల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. రూ. 169 ప్లాన్‌తో 30 రోజుల వ్యాలిడిటీ, 8జీబీ డేటా, 30 రోజుల మొబైల్ సబ్‌స్క్రిప్షన్ వస్తుంది.
ఐపీఎల్ 2025లో 10 జట్లు ఉండగా.. మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈసారి 500 మిలియన్లకు పైగా ప్రేక్షకులు ఐపీఎల్ ని జియోహాట్‌స్టార్ లో వీక్షించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హెచ్డీ అండ్ 4కే క్వాలిటీలో ఐపీఎల్ 2025 మ్యాచ్‌లను చూడటానికి ఈ ప్లాన్లు బాగా ఉపయోగపడతాయి. 5జీ నెట్‌వర్క్ సహాయంతో మరింత స్పష్టమైన వీడియో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంటుందన్న సంకేతాలు వస్తున్నాయి.
![]() |
![]() |