ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పద్మావతి అమ్మవారి ఆలయంలో తిరుపతి జెఈవో పరిశీలన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 08:26 PM

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీబి.లక్ష్మీకాంతం సోమవారం ఉదయం అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఫ్రైడే గార్డెన్‌లో ఆలయ స్థలపురాణం, అమ్మవారి పుట్టుక, శ్రీపద్మావతి పరిణయం, శ్రీనివాసుడి కల్యాణం వరకు వరుసక్రమంలో ఛాయచిత్రాలతో కూడిన కథనాన్ని తెలుసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఆగ్‌మెంటేషన్‌ రియాలటీ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్‌ను లింక్‌ చేస్తున్నామని, భక్తులు శ్రీ పద్మావతి అమ్మవారి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, ఆయా ఛాయచిత్రాన్ని స్కాన్‌ చేసినట్లు అయితే ఛాయచిత్రంలోని దేవతలు, ఋషులు తమ వృత్తాంతాన్ని తెలియజేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రెండో దశలో మండపం స్తంభాలలోని శిల్పాలను లింక్‌ చేయడం వల్ల శిల్పాలే మాట్లాడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తద్వారా భక్తులు ప్రత్యేక అనుభూతి పొందవచ్చని తెలిపారు. 3డి లేజర్‌ కమ్‌ ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ ద్వారా పద్మపుష్కరిణిలో అమ్మవారి పురాణ మహిమలు, రూపాలు నీటిలో కనిపించేలా చర్యలు చేపట్టామన్నారు. మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా తిరుచానూరులో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa