తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రాబోయే బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయంలో అధికారులతో కలసి జెఈవో సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చలువపందిళ్లు, తాగునీరు, తదితర ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా టిటిడి ఆలయాల ఆభరణాలపై మరింత ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ముందుగా శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ప్రయోగాత్మకంగా రేడియో ఫ్రిక్వెన్సీ ఐడెండిటి డివైజ్ (ఆర్.ఎఫ్.ఐ.డి) టెక్నాలజీ ద్వారా ఆభరణాలకు భద్రత కల్పిస్తామన్నారు. ఆభరణాలకు సెన్సార్‌మేటిక్ చిప్స్ ఏర్పాటు చేయడం వల్ల ఏవరైనా దురుద్దేశంతో తరలిస్తే తక్షణం గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆగమ సలహాదారుల సలహా మేరకు శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని, దశలవారీగా మిగిలిన టిటిడి స్థానిక ఆలయాలలో అమర్చుతామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa