ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు బాణం దెబ్బకు జగన్‌ 10 తలలు కుప్పకూలుతాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 09:07 PM

మోదీ, కేసీఆర్‌ ఒత్తిడితోనే ఏపీలో తొలి విడతలో ఎన్నికలు పెట్టించారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ‘‘ప్రతిపక్షాలను పడగొట్టేందుకు టీడీపీకి ఉన్న ఆయుధం ప్రజలే. ఏపీని దోచుకునేందుకు 10 తలలతో జగన్‌ యుద్ధానికి వస్తున్నారు. చంద్రబాబు బాణం దెబ్బకు జగన్‌ 10 తలలు కుప్పకూలుతాయి. జగన్‌ వైసీపీని కేసీపీగా మార్చడమే కాకుండా టీడీపీ సానుభూతిపరులను బెదిరించి వైసీపీలో చేర్చుకుంటున్నారు. ఏపీ ఎన్నికలు చంద్రబాబుకు, కేసీఆర్‌కు మధ్యే. జగన్‌ పార్టీకి కేసీఆర్‌ పెట్టుబడిపెడుతున్నారు’’ అని బుద్దా వెంకన్న చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa