ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ నినాదంతోనే ముందుకెళ్దాం..: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 09:10 PM

ప్రస్తుతం ఎన్నికల ఎమర్జెన్సీ సమయం అని, ప్రతి ఒక్కరు అవిశ్రాంతంగా పనిచేయాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ నెల రోజులు ఎవరికీ సెలవులు లేవని, ఎవరికీ మినహాయింపులు ఉండవని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఒక్క నిమిషం కూడా వృధా చేయరాదన్నారు. ‘మీ భవిష్యత్తు - మా బాధ్యత’ నినాదంతో ముందుకెళ్దామని పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
కేసీఆర్‌‌‌పై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు-
సార్వత్రిక ఎన్నికల నగరా మోగడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరింత వేడెక్కింది. ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ఓటర్లకు ఎలా చేరువకావాలో దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీపై, బీజేపీ, టీఆర్ఎస్‌పైనా తీవ్ర విమర్శలు చేశారు. అభివృద్ధి, సంక్షేమం పనుల్లో తెలుగుదేశం నిమగ్నమై ఉంటే.. కుట్రలు చేసే పనుల్లో మోదీ, కేసీఆర్, జగన్ నిమగ్నమై ఉన్నారని దుయ్యబట్టారు. 
కేసీఆర్ విషయమై ప్రత్యేకంగా ప్రస్తావించిన సీఎం చంద్రబాబు.. ఆయన నోరు ఎలా మూయించాలో తమకు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. ‘మనం అంతా ఓటర్లతో మమేకం అవుతున్నాం.. వాళ్లంతా ఓట్లు తొలగించే కుట్రల్లో ఉన్నారు. మనం గ్రామాలు-వార్డులు తిరిగే పనుల్లో ఉన్నాం. వాళ్లు ఇతర రాష్ట్రాల్లో ఉంటూ ఫారం-7 ద్వారా కుట్రలు చేస్తున్నారు’ అని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ కుట్రలు తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మూడు పార్టీల కుతంత్రాలకు ఈ ఎన్నికలు సమాధానం కావాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa