గత సంవత్సరం జులైలో ప్రైవేటు టెలికాం ప్రొవైడర్లు భారీగా రీఛార్జ్ ధరలు పెంచడంతో అనేక మంది బీఎస్‌ఎన్‌ఎల్ వైపు పోర్టింగ్ అయ్యారు. అయితే ఇటీవల కాలంలో నెట్‌వర్క్ సమస్యలు, కాల్ డ్రాప్‌ల కారణంగా లక్షల మంది యూజర్లు మరోసారి బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు పోర్టింగ్ అవుతున్నారు. దీంతోపాటు దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. నెట్‌వర్క్ సమస్యలు లేకుండా టవర్ల వద్ద బ్యాటరీలను ఏర్పాటు చేస్తోంది. మరియు ఇతర సమస్యలను పరిష్కారం చేస్తోంది. దీంతోపాటు వినియోగదారులను ఆకట్టుకొనేందుకు తక్కువ ధరలో అనేక రీఛార్జ్ ప్లాన్‌లను లాంచ్ చేస్తోంది.
ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో (BSNL Rs319 Recharge Plan) భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు ఈ ప్లాన్ మొత్తంగా 300 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు 10GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఏకంగా 65 రోజులుగా ఉంది. కాలింగ్ అవసరాలు ఎక్కువగా మరియు తక్కువ డేటాను వినియోగించే వారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. మరియు BSNL రెండో సిమ్ కార్డుగా ఉపయోగిస్తున్న వారికి కూడా ఈ ప్లాన్ అనుకూలం.
![]() |
![]() |