ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభ్యర్థుల ఎంపికపై పవన్ కసరత్తు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 12, 2019, 11:34 AM

అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. నాదెండ్ల మనోహర్, పులిశేఖర్, శివశంకర్, గంగాధరంతో జనసేనాని భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు మినహా ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని స్పష్టం చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్… జనసేన – లెఫ్ట్ పార్టీల సీట్లపై దృష్టి సారించారు. ఓవైపు జనసేన అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. నేడు లేదా రేపు తొలి జాబితా ఖరారు చేయనున్నారు. ఇక ఇవాళ సాయంత్రం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే వామపక్షాలు పోటీ చేసే అసెంబ్లీ స్థానాలను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా. లెఫ్ట్ పార్టీలు.. పలాస, రంపచోడవరం, పి.గన్నవరం, పాయకరావుపేట, పోలవరం, పాడేరు, ఎచ్చెర్ల, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, అనంతపురం అసెంబ్లీ స్థానాలు తమకు కేటాయించాలని కోరుతున్నాయి. అయితే, అభ్యర్థులను నేడో.. రేపో ప్రకటించేందుకు సిద్ధమవుతున్న జనసేనాని… లెఫ్ట్ పార్టీల సీట్ల విషయం ఇవాళే ఫైనల్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa