ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అజంగఢ్‌ నుంచి అఖిలేష్‌ యాదవ్‌ పోటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 12, 2019, 11:38 AM

లక్నో : సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ అజంగఢ్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నారు. ఈ స్థానానికి పోలింగ్‌ ప్రక్రియ మే 12న జరగనుంది. అయితే అజంగఢ్‌ నియోజకవర్గం నుంచి అఖిలేష్‌ తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. మెయిన్‌పూరి నియోజకవర్గం నుంచి ములాయం పోటీ చేస్తున్నట్లు ఇటీవలే ఎస్పీ తొలి జాబితాలో ప్రకటించారు. అఖిలేష్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ కన్నౌజ్‌ నుంచి బరిలో ఉండనున్నారు. మెయిన్‌పూరి నియోజకవర్గంలో ఏప్రిల్‌ 23న, కన్నౌజ్‌లో ఏప్రిల్‌ 29న ఎన్నికలు జరగనున్నాయి. అఖిలేష్‌ తీవ్ర కసరత్తు చేసి అజంగఢ్‌ స్థానాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం కావడం, ముస్లిం మెజార్టీ ఎక్కువగా ఉండడం తనకు కలిసి వస్తుందని అఖిలేష్‌ అజంగఢ్‌ను ఎంపిక చేసుకున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ - ఎస్పీ పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa