ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్పుపై మాట్లాడే యోగ్యత జగన్ కు లేదు : యనమల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 12, 2019, 12:06 PM

మార్పుపై మాట్లాడే యోగ్యత జగన్మోహన్ రెడ్డికి లేదని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ…. అసెంబ్లీకి రాకుండా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడమే మార్పా అని యనమల ప్రశ్నించారు. మోడీ భయంతో వైకాపా ఎంపీలతో రాజీనామా చేయించడమే మార్పా అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే జగన్ కోరే మార్పా.. లేక భాజపాతో కుమ్మక్కు కావడమే జగన్ తెచ్చే మార్పా యనమల అడిగారు. తెరాసతో లాలూచీపడటమే జగన్ కోరే మార్పా అని అడిగారు. ఏపీకి నమ్మకద్రోహం చేసిన భాజపాతో జగన్ దోస్తీ చేయడం, ఏపీ అభివృద్దికి అడ్డంపడే తెరాసతో జగన్ లాలూచీ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వని మోడీని జగన్ ఎందుకు ప్రశ్నించరని యనమల అన్నారు. తెదేపా, వైకాపాలో దేన్ని రద్దు చేయాలో రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారన్నారు. 9లక్షల ఫారం-7 అప్ లోడ్ వెనుక కుట్రదారులు ఎవరని, ఇతర రాష్ట్రాల నుంచి ఫారం-7 ఎవరు అప్ లోడ్ చేశారు ? తెదేపా కార్యకర్తల డేటా చోరీ సూత్రధారి ఎవరని అడిగారు. ఓటమి భయంతోనే భాజపా, తెరాసతో జగన్ కలిశారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa