ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల జాతర మొదలైంది. 47 మార్కెట్ కమిటీలకు సంబంధించి తెలుగు దేశం పార్టీ శుక్రవారం ఛైర్మన్లను ప్రకటించింది. 47 మార్కెట్ కమిటీలకు గానూ.. సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేయనుంది. ఇక, అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ సైతం చేయనుంది. ప్రకటించిన 47 ఏఏంసీ ఛైర్మెన్ల పదవుల్లో 37 టిడిపి, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి. టీడీపీ త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల ఛైర్మెన్లను ప్రకటించనుంది.
![]() |
![]() |