షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నప్పటి వరకు ఆ దేశంతో భారత్ బంధాలు బలంగా ఉన్నాయి. ఆమె ప్రభుత్వం కూలిపోయిన తర్వాత రెండు దేశాల మధ్య బంధాలు నానాటికీ బలహీనపడుతున్నాయి. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ భారత్ వ్యతిరేక వైఖరితో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. చైనా, పాకిస్థాన్ లకు బంగ్లాదేశ్ దగ్గరవుతోంది. తాజాగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ భేటీ అయ్యారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా యూనస్ చైనాకు వెళ్లారు. ఈ క్రమంలో ఈ ఉదయం జిన్ పింగ్, యూనస్ భేటీ అయ్యారు. బుధవారం హైనాన్ ప్రావిన్స్ లోని బోవో ఫోరమ్ ఫర్ ఆసియా వార్షిక సదస్సులో యూనస్ పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన బీజింగ్ కు చేరుకున్నారు. బీజింగ్ లో చైనా ప్రభుత్వ ప్రతినిధులతో యూనస్ భేటీ అయ్యారు. చైనా ఇస్తున్న రుణాలకు వడ్డీలు తగ్గించాలని, ఆ దేశ నిధులు అందుతున్న ప్రాజెక్టులకు కమిట్ మెంట్ ఫీజును మాఫీ చేయాలని వారిని కోరారు. ఈ ఉదయం చైనా అధినేతతో భేటీ అయ్యారు.
![]() |
![]() |