ఓ మహనీయుడి విజన్ నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశమని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకూ ఎవరూ ఈ రికార్డును బ్రేక్ చేయలేదన్నారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం దక్కించుకున్న ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మరలా పుట్టరని, పుడితే ఆయనే మరలా పుట్టాలన్నారు. పేదల సంక్షేమానికి పాటుపడిన నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. తెలుగువారు ఉన్నంత కాలం పార్టీ ఉంటుందన్నారు.
![]() |
![]() |