కోవెలకుంట్ల మండలం, అమడాల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి పాల్గొన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగులతో బాధపడుతున్న లబ్ధిదారులను స్వయంగా పరామర్శించి, ఇంటివద్దే పింఛన్లు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో ప్రతి లబ్ధిదారునికి న్యాయం చేయడం తమ బాధ్యత అని మంత్రి తెలిపారు. స్థానిక నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
![]() |
![]() |