వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతివ్వడం పై ముస్లిం సమాజం ఆగ్రహంగా ఉందని గ్రహించిన చంద్రబాబు దాని నుంచి దృష్టి మళ్ళించేందుకు తాజాగా డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభలో వైయస్ఆర్‌సీపీ వక్ఫ్ సవరణ బిల్లు సందర్భంగా విప్ జారీ చేయలేదంటూ చంద్రబాబు తన పచ్చమూకతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి తెగబడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి నిన్నటి అప్పులు, నేటి వక్ఫ్ సవరణ బిల్లు వరకు చంద్రబాబు అబద్దాలకు అంతు లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
![]() |
![]() |