కూటమి ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాలు అధికంగా ఉన్న జిల్లాల్లో రూ. వెయ్యి కోట్ల ఖర్చుతో రోడ్లను నిర్మిస్తోంది. ప్రస్తుతం రూ. 400 కోట్లు ఖర్చు చేశాం. మరో రెండు మూడు నెలల్లో రూ. 600 కోట్లు రోడ్ల నిర్మాణం నిమిత్తం ఖర్చు చేయబోతున్నాం. వైసీపీ తన ఐదేళ్ల పాలన కాలంలో ఏజెన్సీ ప్రాంతంలో కనీసం వంద కిలోమీటర్ల రోడ్లను వేయలేకపోయింది. మొత్తం వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది. ఎవరికి ప్రశాంతత లేకుండా పరిపాలించారు. వాలంటీర్ల దగ్గర నుంచి ప్రజలను, వ్యవస్థలను త్రిశంకు స్వర్గంలో పెట్టారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికే సమయం సరిపోతోంది. నాకు తెలిసినంత వరకు మద్యంలో రూ. 25 వేల కోట్ల అవినీతి జరిగింది. దొరికినకాడికి దొరికినట్టుగా దోచేశారు
![]() |
![]() |