వాలంటీర్లకు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వేతనాలు పెంచడంపై మొదటి క్యాబినెట్ సమావేశంలోనే చర్చించాం. అయితే వాలంటీర్లకు సంబంధించి గత ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి జీవోలు ఇవ్వలేదు. సరైన ఉత్తర్వు పత్రాలను, జీతభత్యాలను లేకుండానే వారిని నియమించింది. గౌరవ వేతనాలు విచిత్రంగా ఎక్కడ నుంచి అందించిందో కూడా తెలియని పరిస్థితి కనిపించింది. నేను ఈ విషయంపై చర్చకు తీసుకురాగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ విద్యా, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు పరిశీలన చేసి వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక నియామకాలు జరగలేదని గుర్తించారు. వాలంటీర్ల ఉద్యోగాల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం వారిని నిలువునా వంచించిందని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. వాలంటీర్లను సేవ చేయడానికి తీసుకొని గౌరవ వేతనాల పేరుతో అనధికారిక చెల్లింపులు జరిపినట్లు తెలుస్తోందన్నారు. పేరుకు ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించి, పూర్తిగా వారు ఏ కోవలోకి చెందకుండా పని చేయించుకున్నారని స్పష్టం చేశారు. అసలు జీతాలు ఎక్కడ నుంచి వచ్చాయో వాలంటీర్లు అంతా సంఘ నాయకులను ప్రశ్నించాలని, విచిత్రమైన అకౌంటింగ్ తో యువతను నిలువునా మోసం చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. యువత జీవితాలు బాగుండాలని కలలు కనే వ్యక్తినని, వాలంటీర్లను ఆదుకునే విషయంలో సరైన దారి వెతుకుతామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. అల్లూరి సీతా రామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కురుడి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులు చెప్పిన సమస్యలు అసాంతం విన్నారు. వాటిని రాసుకున్నారు. అనంతరం సమస్యలపై అధికారులకు తగు సూచనలు చేసి పరిష్కార మార్గాలు వెతకాలని చెప్పారు. ఈ సందర్భంగా కొందరు యువత వాలంటీర్ల సమస్యలను ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ "వాలంటీర్ అనే పేరును వైసీపీ ప్రభుత్వం అతి తెలివితో పెట్టింది. వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వచ్చిన వారు అని అర్థం. కానీ ప్రచారం మాత్రం ప్రభుత్వ ఉద్యోగమని మభ్యపెట్టి యువతను మోసం చేశారు. కనీసం వారికి ఎక్కడ నుంచి జీతాలు ఇచ్చారో కూడా ఆర్థిక శాఖ వద్ద నివేదిక లేదు. యువతను పూర్తిగా వంచించి వైసీపీ పబ్బం గడుపుకొంది.
![]() |
![]() |