వక్ఫ్ బిల్లుపై జగన్ ముస్లింలను మోసం చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. వైసీపీకి స్టాండ్ అనేది లేదన్నారు. టీడీపీ ఎప్పుడు ఒకే స్టాండ్ పై ఉందని వెల్లడించారు. వక్ఫ్ బిల్లు వల్ల ముస్లింలకు నష్టం జరగకూడదని టీడీపీ సవరణల సమయంలో చెప్పిందన్నారు. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వైసీపీ అనుకూలంగా ఓటు వేసిందన్నారు. లోక్‌సభలో బిల్లుకు వైసీపీ వ్యతిరేకంగా ఓటు వేసిందని మండిపడ్డారు. జగన్ చేతగాని నాయకుడని విమర్శించారు. జగన్ తల్లిని చెల్లిని కాదు... ముస్లింలను మోసం చేశారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
![]() |
![]() |