తమిళనాడు రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడి నియామకంపై ఆ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో తాను లేనని ఆయన స్పష్టం చేశారు. పలు రాష్ట్రాల్లో నూతన అధ్యక్షుల నియామకంపై బీజేపీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఈ సమయంలో అన్నామలై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.తమిళనాడులో బీజేపీ నాయకత్వం కోసం నేతలు ఎవరూ పోటీ పడరని, అందరం కలిసి ఏకగ్రీవంగా ఒక నాయకుడిని ఎన్నుకుంటామని అన్నామలై తెలిపారు. తాను కూడా ఈ రేసులో లేనని ఆయన స్పష్టం చేశారు. పార్టీకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.పార్టీ ప్రగతి కోసం ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించారని ఆయన గుర్తు చేశారు. బీజేపీ ఎప్పటికీ బాగుండాలని కోరుకునే వ్యక్తిని అని అన్నామలై అన్నారు. తాను ఎలాంటి రాజకీయ ఊహాగానాలపై స్పందించలేనని ఆయన తేల్చి చెప్పారు. ఇతర పార్టీల మాదిరిగా బీజేపీలో అధ్యక్ష పదవి కోసం 50 మంది నేతలు నామినేషన్ వేసే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు.
![]() |
![]() |