కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన కూతురు టి.వీణను విచారించేందుకు కేంద్రం అనుమతిని ఇచ్చింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అక్రమ లావాదేవీల్లో ఆమె ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. కంపెనీల చట్టం ఉల్లంఘన కింద ఆమెపై కేసు నమోదయింది. ఈ క్రమంలో కొచ్చిన్ లోని ప్రత్యేక న్యాయస్థానంలో ఆమెపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇదే కేసులో ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. గతంలో బంగారం స్మగ్లింగ్ కేసులో విజయన్ కూతురుకి సంబంధాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆ ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపాయి.
![]() |
![]() |