బాపట్ల జిల్లాలో పర్యటించిన సీఎం.. చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో పెన్షన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించిన ముఖ్యమంత్రి.. లబ్ధిదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొత్తగొల్లపాలెం ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడుతూ... ప్రజలే ముందు.. ఆ తర్వాతే మిగతా పనులు అని స్పష్టం చేశారు. ‘గతంలో బటన్ నొక్కామని చెప్పారు.. మీ బటన్లు అన్నీ నా పెన్షన్‌తో సమానం. ప్రజా సేవల పేరుతో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టా. ముందుండి నడిపించాలనే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నా. పెన్షన్లు ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలి. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఏపీ కంటే తక్కువ పెన్షన్’ అని చెప్పుకొచ్చారు. మళ్లీ అమరావతిని గాడిన పెట్టామని తెలిపారు. అక్కడ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. విశాఖ స్టీల్ కూడా గాడిలో పడిందన్నారు. విశాఖ ఉక్కుకు రూ.11 వేల కోట్లు నిధులు తెచ్చామన్నారు. విశాఖకు రైల్వే జోన్ కూడా వచ్చిందన్నారు. ఈనెలలోనే డీఎస్సీ పూర్తి చేసి జూన్‌లోగా టీచర్ల నియామకాలు చేపడతామన్నారు. ఉద్యోగులు ప్రజా సేవలో బాగా పని చేస్తున్నారని అన్నారు. తాను ఏం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నానని విమర్శించే వాళ్ళు కళ్లు తెరిచి చూడాలని అన్నారు. 2027కి పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానం చేస్తామని సీఎం స్పష్టం చేశారు.
![]() |
![]() |