ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించుటకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం సాలూరు పట్టణంలో ఆర్టిసి కాంప్లెక్స్ వద్ద నూతన బస్సును మంత్రి సంధ్యారాణి జెండా ఊపి ప్రారంభించారు. స్వయంగా బస్సును నడిపి డ్రైవర్లలో స్ఫూర్తిని నింపారు. ప్రజలు సుఖంగా ప్రయాణం చేయాలని ప్రభుత్వ సంకల్పం అన్నారు. దశల వారీగా కొత్త బస్సులను అన్ని డిపోలకు ఏర్పాటు చేయడం జరుగుతోందని ఆమె అన్నారు.
![]() |
![]() |