ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలులో 4వ తేదీన ప్రాంతీయ రైతు సంఘం సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు నాయకులు తిమ్మయ్య తెలిపారు. మంగళవారం ఆదోనిలో మాట్లాడారు. ఈ సదస్సులో కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు హాజరు కావాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు, రుణాలు, పింఛన్లు, కౌలు రైతు చట్టం అమలు చేసే అవసరాన్ని వెల్లడించారు. ఏప్రిల్ 15, 16, 17లో తమిళనాడులోని నాగపట్టణంలో జరుగనున్న మహాసభలను జయప్రదం చేయాలన్నారు.
![]() |
![]() |