పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆరు మండలాలలో ముస్లిం సోదరులు సోమవారం ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలతో నెలరోజుల పాటు నియమనిష్టలతో గడిపిన ముస్లింలు నేడు రంజాన్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. స్థానికంగా ఉన్న ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
![]() |
![]() |