ప్రధాని నరేంద్ర మోదీకి ప్రైవేట్ కార్యదర్శిగా ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి నిధి తివారీని నియమిస్తూ సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2014 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన నిధి తివారీ ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మార్చి 29న వెలువడిన ఉత్తర్వుల ప్రకారం, కో-టెర్మినస్ ప్రాతిపదికన ప్రైవేట్ కార్యదర్శిగా తివారీ నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది.
![]() |
![]() |