కేంద్ర ప్రభుత్వం నేడు (ఏప్రిల్ 2) వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ తమ పంథా ప్రకటించింది. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ చట్ట సవరణ ముస్లిం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని జనసేన విశ్వసిస్తోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జనసేన పార్టీ లోక్ సభ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని ఆదేశించారు.
![]() |
![]() |