అమలాపురం లోక్‌సభ నియోకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మాజీ ఎంపీ హర్షకుమార్ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు పార్టీ అధినేత వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో అమరావతిలో ఈరోజు హర్షకుమార్ భేటీకానుండడంతో ఈ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఈ స్థానం నుంచి హర్షకుమార్ పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో కాంగ్రెస్ ప్రాభవం కోల్పోవడంతో హర్షకుమార్ ఈసారి సైకిలెక్కి అదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. హర్షకుమార్‌తో భేటీ అనంతరం ఈ విషయంపై చంద్రబాబు ఒక ప్రకటన చేయవచ్చునని భావిస్తున్నారు. లోక్‌సభకు హర్షకుమార్ పేరు ఖరారైతే అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి జి.ఎం.సి. హరీష్‌మాధుర్‌ను పోటీ చేయించే అవకాశం ఉందంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa