ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏప్రిల్‌ 1న తిరుమలలో అన్నమయ్య సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 13, 2019, 02:48 PM

పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 516వ వర్ధంతి తిథి ద్వాదశిని పురస్కరించుకుని ఏప్రిల్‌ 1వ తేదీ తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం ఘనంగా జరుగనుంది. శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 6.00 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు చేరుకుంటారు.  శ్రీ అన్నమాచార్య గురుపరంపరకు చెందిన శ్రీ అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీమాన్‌ శ్రీవణ్‌ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామీజీ విచ్చేయనున్నారు. టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌తోపాటు ప్రముఖ సంగీత కళాకారులు శ్రీమ‌తి శ్రీ‌నిధి, కుమారి అన్న‌పూర్ణ మ‌ధులిత‌  పాల్గొంటారు. అదేవిధంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులు, భజన బృందాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa