అమరావతి : లోక్‌సభ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి భగ్గుమంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి టికెట్‌పై టీడీపీలో రచ్చ మొదలైంది. ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుకు సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కోడెల శివప్రసాద్‌కు టికెట్ ఇస్తే సహకరించేది లేదని హైకమాండ్‌ను అసమ్మతి నేతలు హెచ్చరించారు. పోలవరం ఎమ్మెల్యే టికెట్‌పై కూడా గందరగోళం నెలకొంది. చంద్రబాబు నివాసం ముందు టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్‌కు టికెట్ ఇవ్వొద్దని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అరుపులు, వ్యతిరేక నినాదాలతో చంద్రబాబు నివాసం దద్ధరిల్లింది. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు గళమెత్తారు. ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వొద్దని చంద్రబాబు నివాసం వద్ద కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa