మామిడిపండ్లు అంటే ఇష్టపడని వారుంటారా చెప్పండి. వందలో 99 శాతం మందికి ఈ పండ్లు అంటే ఇష్టమే. ప్రతి ఒక్కరూ ఈ పండుని ఇష్టంగా తింటారు. అందుకే, ఈ పండ్లకోసం సంవత్సరమంతా ఎదురుచూస్తారు. కొంతమందైతే వేర్వేరు ప్రదేశాల నుంచి ఆ పండ్లని తెప్పించుకుని మరీ తింటారు. వాటి రుచి అంత గొప్పది మరి. అందుకే, ఈ పండ్లకి పండ్ల రారాజు అని పేరు పెట్టారు. వీటికి ఇంత పాపులారిటీ ఉంది కాబట్టి, మార్కెట్లో వీటిని డూప్లికేట్ అంటే సహజంగా పండినవి కాకుండా కెమికల్స్ వేసి మరీ పండించి అమ్ముతుంటారు. వీటిని తినడం వల్ల చాలా సమస్యలొస్తాయి. పైగా అంతగా రుచి ఉండవు. మరి ఇలాంటి పండ్లలో అసలైనవి ఎలా కనిపెట్టాలి. మనం కొనే పండ్లు నకలివో కాదో ఎలా తెలుసుకోవాలో చెక్ చేయండి.
స్కిన్ కలర్
ఆర్టిఫీషియల్‌గా పండించిన మామిడిపండ్లు అన్నీ కూడా ఒకే కలర్‌లో ఏదో యూనిఫామ్‌లా ఉంటాయి. అదే విధంగా, ఇవి మరీ ఎక్కువ పసుపు రంగులో ఉంటాయి. నేచురల్‌గా పండినవి అక్కడక్కడ ఆకుపచ్చ రంగులో కూడా ఉంటుంది. ఈ పండ్లు నేచురల్‌గానే షైనీగా ఉంటాయి.
వాసన
ఇప్పుడు మీ ముక్కుకి పని చెప్పాలండి. నేచురల్‌గా పండిన పండ్లు కాస్తా తియ్యని వాసనతో పండ్ల స్మెల్ వస్తుంది. అదే కెమికల్ వేసి పండించిన పండ్లు కాస్తా కెమికల్ వాసనతో పాటు డిఫరెంట్‌గా స్మెల్ వస్తుంటుంది. ఇది ఎక్కువగా పీల్చుకోలేం. అదో రకమైన వాసన వస్తుంటుంది. కాబట్టి, వీటిని తీసుకోకపోవడమే మంచిది.
రుచి
కెమికల్ వేసి పండించిన పండ్లు తినడానికి అంతగా రుచిగా ఉండవు. ఏదో చప్పగా ఉంటాయి. అదే నేచురల్‌గా పండించిన పండ్లు సాధారణంగానే తియ్యగా రసలూరుతూ ఉంటాయి. కాబట్టి, వీటిని రుచిని కూడా చూసి గుర్తించొచ్చు.
గాయాలు
నేచురల్‌గా పండిన పండ్లు చక్కగా ఉంటాయి. కానీ, కెమికల్స్ వేసి పండించిన పండ్లు బయట దెబ్బలతో నిండిపోతాయి. కెమికల్స్ వాడడం వల్ల మచ్చలు, గాయాలు ఏర్పడతాయి. కానీ, నేచురల్‌గా పండిన పండ్లకి ఇవి ఎక్కువగా ఉండవు.
సాఫ్ట్‌గా ఉండడం
కెమికల్ వేసి పండించిన పండ్లు నార్మల్ పండ్ల కంటే మరింత సాఫ్ట్‌గా ఉంటాయి. నేచురల్‌గా పండిన పంట్ల కంటే ఇవి సాఫ్ట్‌గా ఉంటాయి. ఎందుకంటే వీటిని కెమికల్స్ వేసి పండిస్తారు కాబట్టి తొక్కలోని సెల్స్ తగ్గి సాఫ్ట్‌గా మారతాయి.
నీటిలో తేలడం
నీటిలో పండ్లని వేసి కూడా చెక్ చేయొచ్చు. అందుకోసం బకెట్ నీటిలో పండ్లను వేయండి. మామిడిపండ్లు మునిగితే అవి నేచురల్‌గానే పండించిన పండ్లు. అలా కాకుండా తేలితే మాత్రం కృత్రిమంగా పండించిన పండ్లు. అదే విధంగా, ఈ పండ్లని కొద్దిగా బేకింగ్ సోడా వేసిన నీటితో కడిగి చూడండి. దాని రంగు మారితే వి కెమికల్‌తో పండించిన మామిడి పండ్లు అని అర్థం.
![]() |
![]() |