తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేయాలన్న మా గొంతు నొక్కాలని చూడొద్దని వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి పేర్కొన్నారు. టిటిడి నిధులు తిరుపతి పారిశుద్ధ్యంకు వినియోగించాలి లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటా అని మెసేజ్ పెట్టినందుకు బాలాజీ అనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను తిరుపతి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న భూమన అభినయ్‌రెడ్డి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తిరుపతి అభివృద్ధిని అడ్డుకోవద్దంటూ బిజెపి నేత భాను ప్రకాష్ రెడ్డికి వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చేస్తేనే అరెస్టు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. టిటిడి నిధులు వాడకూడదని బిజెపి భాను ప్రకాష్ రెడ్డి ఇప్పటికే అభివృద్ధి దోహదకులుగా కోర్టులో కేసు వేశారని తెలిపారు. అభివృద్ధి పనులు ఎవరు చేసినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభినందిస్తుంది, ఇలా అక్రమ అరెస్టులు సరికాదని అభినయ్‌రెడ్డి హితవు పలికారు.
![]() |
![]() |