ఏపీ మంత్రి నారా లోకేశ్ సాక్షి టీవీపై సెటైర్ల వర్షం కురిపించారు. అసలు విషయంలోకి వస్తే ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీపై అలిగినట్లు గా సాక్షి మీడియా సంస్థలో కథనాలు వెలవడ్డాయి. అలాగే గంటా త్వరలోనే టీడీపీకి సెలవు పెట్టనున్నట్లు కూడా వార్తలు వినిపించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ లో వ్యంగ్యంగా స్పందించారు. సాక్షి టీవీ ముందు గంటాతో నవ్వుతూ కలిసి దిగిన ఫోటో లోకేశ్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. అవును నిజమే..గంటా శ్రీనివాసరావు గారి ముఖంలో అలక చూడండి..! అవును నిజమే Look how unhappy @Ganta_Srinivasa is..! అవినీతి డబ్బా ... అవినీతి పత్రిక అని ట్వీట్ చేశారు. దీనికి #FakeNewsSaakshi #FakeTV #Fakeleader అనే హ్యాష్ ట్యాగ్ లను కూడా ఆయన జతచేశారు. ఇప్పడు ఇది కాస్త సోషల్ మీడియాలో చక్కర్లుకోడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa