దేశంలో ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు మొత్తం ఏడు దశల్లో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఓటింగ్ శాతం ప్రతీసారి ఆశించినంత మేర పెరగడం లేదు. ఈ క్రమంలో మోడీ ప్రత్యర్థ పార్టీల నాయకులకు, బాలీవుడ్ స్టార్స్‌కు, క్రీడాకారులతో పాటు కొన్ని మీడియా సంస్థలకు ఓ ట్వీట్ చేశారు. ఓటింగ్ శాతం పెంచేలా ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. తమదైన శైలిలో ఓటర్లను ఉత్తేజపరిచి ఓటేసేలా ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకురావాలని కోరారు. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, శరద్ పవార్, సీఎం కేసీఆర్, మాయావతి, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, ఎంకే స్టాలిన్, అక్షయ్ కుమార్, ఆయుష్‌మాంక్, గీతా ఫోగట్, బాబితాల్ ఫోగట్‌తో పాటు పలువురికి మోదీ ట్వీట్ ద్వారా సమాచారాన్ని చేరవేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa