ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాకో ఛాన్సివ్వండి : వైసిపి అభ్య‌ర్ధి వ‌సంత కృష్ణ ప్రసాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 13, 2019, 03:20 PM

ఓక్క అవకాశం ఇవ్వండి మైలవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాననిహామీ ఇస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు  వ‌సంత కృష్ణ ప్రసాదు. వైసిపి అభ్యర్ధిని తానేన‌ని చెప్పుతూ ఆయ‌న త‌న ప్ర‌చారాన్ని ఆరంభించారు. ఇప్ప‌టికే ప్ర‌చార ర‌ధం మీద ఆయ‌న జ‌నంలోనికి దూసుకుపోతున్నారు. ఇచ్చిన మాట కోసం 2004 లో అధికారం లోకి రాగానే మహనేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారు పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అయితే 2014 లో తెలుగు దేశం పార్టీ 600 హమీలు ఇచ్చి అధికారం లో కి రాగానే వాటిలో 6 హమీలు కూడా పూర్తిగా అమలు చేయలేదని  విమ‌ర్శించారు.
మైలవరం నుంచి ఎన్నికైన మంత్రి దేవినేనీ ఉమా తన సోంత మ్యానిఫెస్టో ఇచ్చి మరిచిపోయాడని, ఎమ్మెల్యేగా గెలిచి మొదటి సారి ప్రతిపక్షం రోజు ధర్నాలు, ఆందోళనలు చేస్తూ కాలం గడిపాడు మిన‌హా ఏం చేయ‌లేద‌ని, రెండో సారి గెలిచి మంత్రి గా పదవి చేపట్టిన మైలవరం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.  సాగునీటి మంత్రి గా ఉండి మైలవరం ప్రజలకు సాగునీటి సమస్య కూడా తీర్చలేకపోయిన మంత్రి దేవినేనీ ఉమా అని అన్నారు
ఒక్కసారి కూడా ప్రజాప్రతినిధి గా లేనిత‌న‌పై మంత్రి దేవినేనీ ఉమా అవినీతీ ఆరోపణలు చేయడం అతని దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు పసుపు కుంకుం, అన్నదాత సుఖీభవ అంటూ ప్రభుత్వ నిధులతో ఓట్లు కోనుగోలు చేస్తున్నారుపేదల పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహనరెడ్డి గారు అధికారం లో కి రాగానే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకు వెళ్లి పేదల సంక్షేమం కోసం కృషి చేస్తానని కృష్ణ ప్రసాదు  హమీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa