ఏప్రిల్ 11న జరిగే పోలింగ్ లో ప్రజలంతా పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఓటర్లకు పిలుపునిచ్చారు. బుధవారం నాడు నందిగామలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్థానికి MLA, తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి తంగిరాల సౌమ్యతో కలిసి ప్రచారం నిర్వహించారు. నందిగామలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో దళిత నాయకత్వాన్ని ప్రొత్సహించిన ఏకైన పార్టీ తెలుగుదేశం మాత్రమే అన్నారు. ప్రజల భవిష్యత్తు చంద్రబాబు బాధ్యత అని… ఇదే తమ ఎన్నికల నినాదం అని మంత్రి దేవినేని తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు మోదీ, కేసీఆర్, జగన్, ఒవైసు అందరూ ఏకమయ్యారని…. వీరి ఉమ్మడి లక్ష్యం రాష్ట్రానికి నష్టం చేయడం మాత్రమే అని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు నాయకత్వం వైపు చూస్తున్నారని మంత్రి తెలిపారు. గత ఎన్నికల్లో 75 వేల ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తంగిరాల సౌమ్యను ఎమ్మెల్యేగా గెలిపించారని…. ఈ సారి అంతకన్నా ఎక్కువ మెజారిటీతో సౌమ్యను గెలిపించాలని ఓటర్లను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa