ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నిక‌ల కోసం నెల్లూరులో ఆరువేల మంది పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 13, 2019, 06:50 PM

నెల్లూరు జిల్లా కు సంబందించిన 10 అసెంబ్లీ స్థానాలకు మరియు 2 పార్లమెంట్ స్థానములకు ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్న నేపద్యంలో జిల్లా యస్.పి. ఐశ్వర్య రస్తోగి,  బుధ‌వారం మీడియాలో మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పటిష్టమైన ప్రణాళికలను రూపుందించడం జరిగిందని, ఈ ఎన్నికలకు సంబందించి దాదాపు 6000 మందికి పైగా పోలీసు ఫోర్స్ ను విధులకు ఉపయోగించడం జరుగుతుందని, రాబోవు సాదారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే అంతరాష్ట్ర మరియు అంతర్ జిల్లా సరిహద్దు పోలీసు వారితో మీటింగులు నిర్వహించడం జరిగిందని తెలియచేసారు. అంతే కాకుండా 10.03.2019 సాయంత్రం 5 గంటల నుండి ఎన్నికల నియమావళి అమలులో ఉందని, ప్రజలు, ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు అందరికి ఈ నియమావళి వర్తిస్తుందని, అందరు ఎన్నికల నియమావళి గురించి తెలుసుకొని దానిని పాటించవలసి ఉంటుందని, ఎవ్వరైన ఏ సమయములోనైనను ఎన్నికలు నియమావళి ఉల్లంఘించినట్లైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని, జిల్లా లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు గాను ముందస్తు ప్రణాళికలతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa