ఐపీఎల్ 2025ని విజయంతో ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో వెనకబడి పోయింది. అటు డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆ జట్టు ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున ఉంది. ఈ నేపథ్యంలో తిరిగి విజయాల బాట పట్టడమే లక్ష్యంగా ఈ రెండు జట్లూ సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ ప్రారంభమైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. గత మూడు మ్యాచ్‌లలో సన్‌రైజర్స్.. తొలుత బ్యాటింగ్ చేసింది. ఈసారి మాత్రం టాస్ గెలవడంతో ఛేజింగ్‌కు మొగ్గు చూపింది. కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు అహ్వానించింది. ఇక ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఒక మార్పుతో బరిలోకి దిగింది. స్పెన్సర్ జాన్సన్ స్థానంలో మొయిన్ అలీ తుది జట్టులోకి వచ్చాడు.
కాగా ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఇప్పటివరకూ 28 మ్యాచ్‌లు జరిగాయి. అందులో అత్యధికంగా కేకేఆర్ గెలుపొందింది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా ఏకంగా 19 మ్యాచ్‌లలో విజయం సాధించింది. సన్‌రైజర్స్ మాత్రం 9 విజయాలు నమోదు చేసింది. ఇక క్రితం సీజన్‌లో ఫైనల్ సహా మూడు మ్యాచ్‌లో కేకేఆర్.. ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడించింది. 2020 నుంచి ఇప్పటివరకూ ఈ రెండు జట్ల మధ్య 11 మ్యాచులు జరగ్గా.. అందులో తొమ్మిది మ్యాచులలో కేకేఆర్ విజయం సాధించడం గమనార్హం.
తుది జట్లు ఇవే..
సన్‌రైజర్స్ హైదరాబాద్:
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), కామిండు మెండిస్, సిమర్జిత్ సింగ్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, జీషన్ అన్సారీ
కోల్‌కతా నైట్ రైడర్స్:
క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రఘువంశీ, మొయిన్ అలీ, రమణ్‌దీప్ సింగ్, అండ్రీ రసెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
![]() |
![]() |