ఆడుదాం ఆంధ్ర పేరుతో మాజీ మంత్రి రోజా రూ.కోట్లు దోపిడీ చేశారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆరోపించారు. రోజా గురించి మాట్లాడాలంటే రోతగా ఉందని మంత్రి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం గుంటూరులో ఆమె మాట్లాడుతూ.. వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ప్రజలు ఛీకొట్టి 11 సీట్లు ఇచ్చారని విమర్శించారు. ఏపీలో మహిళలకు తల్లికి వందనం ఇస్తామని మంత్రి తెలిపారు. రైతు కుటుంబాలకు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చామన్నారు.
![]() |
![]() |