ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తుకు సంబంధించి రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు (తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి పట్టభద్రులు మరియు కృష్ణా, గుంటూరు పట్టభద్రుల), ఒక ఉపాధ్యాయ నియోజక వర్గానికి (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ) జరగనున్న ఎన్నికలలో కేంద్ర మరియు రాష్ట్ర ఉద్యోగులకు పోలింగ్ రోజున ప్రత్యేక అవసర సెలవును మంజూరు చేయాలని భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలియజేశారు.
రాష్ట్ర శాసన పరిషత్తుకు సంబంధించి జరిగే ఎన్నికలలో ఓటర్లగా నమోదైన ఓటు హక్కు కలిగిన ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుకల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లకు సదరు ఉత్తర్వులను పంపడమయిందని కూడా తెలియజేశారు. సదరు నియోజక వర్గాలలోని ఆయా ఓటర్లు అయిన ఉద్యోగులకు పోలింగు రోజున ప్రత్యేక అవసర సెలవు (Special Casual Leave) ను మంజూరు చేయడానికి వారికి వీలుకల్పిస్తూ వారి జిల్లాలోని అధికారులు (కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ) అందరికి ఈ విషయాన్ని తెలియజేయవలసిందిగా కోరడమయిందని కూడా తెలియజేశారు. ప్రైవేటు సంస్థల ఉద్యోగుల విషయంలో రాష్ట్ర శాసన పరిషత్తుకు జరిగే ఎన్నికలకు సంబంధించి నెగోషియబుల్ ఇన్¬స్ట్రుమెంట్ చట్టం క్రింద సాధారణ సెలవును ప్రకటించడానికి 1951, ప్రజా ప్రాతినిధ్య చట్టం క్రింద ఏ విధమైన నిబంధన లేదని జిల్లా ఎన్నికల అధికారులకు తెలియజేశామన్నారు.
పట్టభద్రులు / ఉపాధ్యాయుల నియోజక వర్గాలలో ఎందులోనైనా ఓటర్లుగా రిజిస్టరు చేసుకున్న వారి ఉద్యోగులకు పోలింగు రోజున (22-03-2019 ) వారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా కార్యాలయం / విధులకు ఆలస్యంగా హజరుకావడం, షిప్ట్ సర్ధుబాట్లు, పనివేళలలో కొంత సమయం పాటు హాజరు కాకపోవడం లేదా ఇతర విధంగా అనుమతించడం వంటి వెసులుబాటును కల్పించాలని రాష్ట్రంలోని ప్రైవేట్ యాజమానులు / వ్యాపార, వర్తక సంస్థలు, పారిశ్రామిక సంస్థలు లేదా ఇతర సంస్థలన్నింటిని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటనను జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa