ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ల‌చ్చ‌న్న భారం.. చంద్ర‌న్న‌దే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 13, 2019, 09:53 PM

ల‌క్ష్మినారాయ‌ణ‌.. సారీ జేడీ ల‌క్ష్మినారాయ‌ణ‌. ఆయ‌న్నేమో.. నీతి నియ‌మాల‌కు కేరాఫ్ చిరునామా అంటారు. ఈయ‌నేమో.. తాను గాంధేయ‌వాదినంటాడు. ఆయ‌న కొల్లాయి క‌ట్టాడు.. నేను మాత్రం ఖ‌ద్ద‌రు ధ‌రించాను. అంతే త‌ప్ప‌.. ఇద్ద‌రిదీ సేమ్‌టు సేమ్ అంటారు గౌర‌వ‌నీయులైన చంద్రబాబునాయుడు గారు. ఇద్ద‌రూ క‌ల‌సి న‌డుద్దామ‌నే ప్లాన్‌. గాక‌పోతే.. ల‌చ్చ‌న్న‌మో.. ఉద్యోగం చేసి వాలంట‌రీ రిటైర్ మెంట్ తీసుకున్నాడు. పైగా పెద్ద‌గా సంపాదించిదేమీ లేదాయె. రాజ‌కీయ‌పార్టీ పెడ‌దామంటే కాసులు క‌ర‌వ‌య్యాయ‌ట‌. పోనీ.. ఏదైనా పార్టీలో చేర‌దామంటే అమ్మో ఇంకేమైనా ఉందా.. నిన్న‌టి దాకా సీబీఐ లో చ‌క్రం తిప్పి హ‌స్తంలో చేరితే.. అనుచ‌రుడంటారు. పోనీ బీజేపీలో దూరితే.. కాషాయం అంట‌గ‌డతారు. జ‌న‌సేన‌లో చేరితే కులంకార్డు గుర్తుచేస్తారు.
అందుకే.. అన్నిటికీ అనుకూలంగా ఉన్న ప‌సుపుగూటిలోకి చేరేందుకే ల‌చ్చ‌న్న మొగ్గుచూపుతున్న‌ట్లు స‌మాచారం. ఎంతైనా.. అక్క‌డ మేధావుల అవ‌స‌రం కూడా ఉంద‌ట. టీడీపీ గెలిస్తే. ల‌క్ష్మినారాయ‌ణ‌కు వ్య‌వ‌సాయ‌శాఖ అప్ప‌గించి.. రైతులు.. పొలాల చుట్టూ తిర‌గ‌మ‌ని చెబుతార‌ట‌. ఇక‌పోతే.. అదే కేంద్రంలో చ‌క్రం తిప్పేందుకు ఎంపీను చేస్తే.. ఢిల్లీలో లోగుట్టు అంతా ఎప్ప‌టిక‌ప్పుడు తెలుస్తుంది. పైగా ఏపీ స‌ర్కారు ఈ మ‌ధ్య‌నే సీబీఐను కూడా బ్యాన్ చేసింది. మా ఇలాఖాలో కాలుపెడితే ఊరుకోమంటూ చంద్ర‌బాబు స‌వాల్ విసిరాడు. స‌ర్లే.. ల‌చ్చ‌న్న ఎలాగూ.. ప‌ద‌విలో లేడు కాబ‌ట్టి.. చంద్ర‌బాబు మాట‌లు.. హుంక‌ర‌రింపులు వ‌ర్తించ‌వు అనుకుందాం. మ‌రి అభిన‌వ నీతిప‌రుడు.. గాంధీయ మార్గంలో న‌డిచే చంద్రుడు ఇద్ద‌రూ క‌ల‌సి ఇప్పుడు టీడీపీను ఉరుకులెత్తించే ప‌నిలో ప‌డ్డార‌ట‌. దీనిలో భాగంగానే ఇద్ద‌రి మ‌ధ్య చానాసార్లు చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయంట‌. చివ‌రాక‌ర‌కు.. స‌ర్లే.. జేడీ నువ్వు ఏడోచోట నిబ‌ల‌డితే చాలు.. మిగ‌తాదంతా నేను చూసుకుంటా.. నువ్వు ఓట్లు సంగ‌తి చూసుకుంటే.. నేను నోట్ల ఖ‌ర్చులు చూస్తానంటూ స‌ముదాయించి.. అక్ష‌రాలా రూ.20 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఖ‌ర్చ‌వుతుంద‌ని తేల్చార‌ట‌. ఆ త‌రువాత ఆయ‌న గెలిచి.. సైకిల్ అధికారంలోకి దూసుకెళితే.. ల‌క్ష్మినారాయ‌ణ కోరుకున్న‌ట్లు మంత్రిప‌ద‌వి గ్యారంటీన‌ట‌. కేంద్రంలో ఎన్‌డీఏ కుప్ప‌కూలితే.. కూట‌మిదే అధికారం. అప్పుడు కూడా చంద్ర‌బాబే కేంద్రంలో చ‌క్రం తిప్పుతాడు కాబ‌ట్టి.. ఏకంగా కేంద్రంలోనే వ్య‌వ‌సాయ‌శాఖ ఇస్తామంటూ బోలెడు ఆశ‌లు రేకెత్తించార‌ట‌. అయితే.. ఒక్క‌టే అనుమానం కొడుతుంద‌ట‌. ఎన్నిక‌ల ముందుకు ఇలా ప‌సుపు కండువా క‌ప్పుకుంటే.. దీనివ‌ల్ల టీడీపీ బ‌దులు వైసీపీ లాభ‌ప‌డితే.. అప్పుడేం చేయాల‌నే ప్ర‌శ్న ఇబ్బందిగా మారింద‌ట‌.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa