ఢిల్లీకి పొరుగు రాష్ట్రమైన హర్యానాలోనైనా ఆప్‌తో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకోవాలని కోరుకుంటున్నట్లు ఆప్ నేత కేజ్రీవాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ను కోరారు. ఏప్రిల్-మే నెలలో జరిగే ఎన్నికలలో హర్యానాలో కూటమి గురించి రాహుల్ ఆలోచించాలని కేజ్రీవాల్ అన్నారు. ఇటీవలి చేదు అనుభవాల దృష్ట్యా తాను పొత్తును కోరుకుంటున్నానని మీడియాకు తెలిపారు. మోడీ-షాల ద్వయాన్ని ఓడించాలని ఆ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. హర్యానాలో జననాయక్ జనతా పార్టీ (జెజెపి), కాంగ్రెస్, ఆప్‌లు కలిసి పోరాడితే, బిజెపి పది స్థానాలలో ఓటమి పాలౌతుందని అన్నారు. కాగా, ఢిల్లీలో ఆప్-కాంగ్రెస్ కూటమి లేకుండానే ఒంటరి పోరుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. కాగా, ఢిల్లీలోని అన్ని స్థానాలలో తమ పార్టీ పోటీ చేస్తుందని సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa