ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎక్కువ మంది ఓటేసి కొత్త ప్రధానిని ఎన్నుకోండి

national |  Suryaa Desk  | Published : Wed, Mar 13, 2019, 10:45 PM

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని దేశంలోని ప్రముఖులకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా అభ్యర్థించిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని ట్వీట్‌కు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ వ్యంగ్యంగా స్పందించాడు. ' అత్యధిక సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని కొత్త ప్రధానిని ఎన్నుకోవాలని నేను కూడా ప్రజలను అభ్యర్థిస్తున్నాను' అంటూ ప్రధాని ట్వీట్‌కు రీట్వీట్‌ చేశారు. అఖిలేశ్‌ ట్వీట్లపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ ఘాటుగా స్పందించారు. ట్విటర్‌ వేదికగా తమ ప్రభుత్వ విజయాలను పేర్కొంటూ.. అఖిలేశ్‌పై విమర్మలు చేశారు. యూపీలో ఉండే నేరస్థులంతా తమ పాలనలో అదృశ్యమయ్యారని,ఈ రెండేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు జరగలేదని యోగీ అన్నారు. అఖిలేశ్‌ తన ఇంటిని నుంచి బయటకు వచ్చి గ్రామాల పరిస్థితి చూస్తే చూస్తే తమ ప్రభుత్వ అభివృద్ధి తెలుస్తుందని విమర్శించారు. నేను నిజాలు మాట్లాడితే ఆయన తన ముఖం కూడా చూపించలేరని యోగి ట్వీట్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa