రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద రెడ్డి ఇవాళ లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మెట్టు గోవింద రెడ్డి మాట్లాడుతూ, 2004 లో టీడీపి ఎమ్మెల్యేగా రాయదుర్గం నుంచి గెలిచానన్నారు. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉన్న 30 మంది ఎమ్మెల్యేల్లో నేను ఒక్కడినని అన్నారు. ఆ తర్వాత కూడా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా గెలిచి పార్టీకోసం పనిచేశానన్నారు. కానీ 2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోలేదన్నారు. మంత్రి కాల్వ శ్రీనివాసులు ఇంఛార్జుగా ఉండి రాయదుర్గాన్ని నిర్లక్ష్యం చేశారు. టీడీపీ ప్రభుత్వం తీరుతో విసిగి వేశారి వీడి వైసీపీలో చేరానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa