డోన్ పట్టణ సమీపంలోని జాతీయ రహదారి పై గల కంభాలపాడు సర్కిల్ నందు పట్టణ సీఐ కళా వెంకటరమణ తెల్లవారుజామున 2 గంటలకు జరిపిన తనిఖీల్లో హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ఆరంజ్ ట్రావెల్స్ బస్సు లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల నుండి 1కిలో 228 గ్రాములు బంగారం(38లక్షలు విలువ గల బంగారం) , 88లక్షల 22000వేల నగదు పట్టుబడింది. బెంగళూరుకు చెందిన విజయ జ్యువెలర్స్ అండ్ విజయ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అను కంపెనీకి చెందిన సొమ్ముగా తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులను పోలీసుల అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇంకా వివరాలు అందాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa