త్వరలో జరగబోవు సాదారణ ఎన్నికలను దృష్టిలో ఉంచికుని భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి కె.కె.యన్.అన్బురాజన్ ఐ.పి.యస్ మీడియాకు తెలిపారు. బుధవారం ఆయన బందోబస్తు కు ఏర్పాటు చేసిన సిబ్బందికి విధినిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తపై పలు సూచనలు చేసారు. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో మూడు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయని, (1)తిరుపతి ,2)చంద్రగిరి (భాగము), 3)శ్రీకాళహస్తి 4.నగరి (భాగము), 5.సత్యవేడు (భాగము), ఈ ఐదు నియోజకవర్గాలలో మొత్తం 836 పోలింగ్ కేంద్రాలు(బూత్) వున్నాయని, ఇందులో సమస్యాత్మకమైన ప్రాంతాలు 236 పోలింగ్ కేంద్రాలు ఇప్పటి వరకు గుర్తించామని, ఇంకా సమస్యాత్మకమైన గుర్తింపు కార్యక్రమం జరుగుతున్నదని, సమస్యలు లేని పోలింగ్ కేంద్రాలు 253 గా గుర్తించామని, సమస్యాత్మకమైన గ్రామాలలో సి.సి కెమెరాల ఏర్పాటు చేసి క్షుణ్ణంగా 24/7 ఎలక్షన్ కమాండ్ కంట్రోల్ నందు పరిశీలించడం జరుగుతుందని, ఇంకా జిల్లా సరిహద్దు పరిధిలో మొత్తం 11 చెక్ పోస్ట్ లను కూడా ఏర్పాటు చేసి తనికీ చేయడం జరుగుతుందని, పోలింగ్ కేంద్రాల వద్ద వీడియో చిత్రీకరణ కూడా జరుగుతుందని, ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మొద్దని వారి యొక్క విలువైన ఓటును నిర్భయంగా వినియోగించుకోవచ్చని, మీ పరిసర ప్రాంతాలలో అనుమానిత వ్యక్తులు గాని, వస్తువులు గాని, తారసపడిన యెడల వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని తెలియజేసారు.
సాదారణ ఎన్నికల బందోబస్తు వివరాలు:-
Rank Numbers
SP 01
Addl.SPs 04
DSPs 07
CIs 14
SIs 221
ASI/HCs 309
PCs 736
RIs 03
RSIs 10
ARSIs 82
AR HCs/PC 1,276
HGs 253
Total 2,916
మరియు అదనపు బలగాలు 60 section ల పారామిలటరీ దళము, 60 section ల APSP సిబ్బంది వస్తున్నారని, ఎలాంటి సమస్యలు లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి తిరుపతి పోలీసులు సిద్దంగా ఉన్నారని ఈ సందర్భంగా తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి కె.కె.యన్ అన్బురాజన్ తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa