తను పార్టీ మరుతున్నానంటూ తనపై వస్తున్న పుకార్లను కొట్టిపడేశారు ఏపీ కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ... బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను పార్టీ మారుతున్నానన్న వార్తలు అవాస్తవం అని, అసలు తనకు తెలియకుండానే . మీడియాలో కొందరు దిగజారుడు పనులు చేస్తు, పార్టీ మార్చేసేలా ఉన్నరని మండిపడ్డారు.డబ్బుకు అమ్ముడుపోయి విలువలకు పాతరేసు్తన్న కొందరితో విపక్ష వైసిపి . మైండ్ గేమ్ ఆడుతోందని ఆయన ఆరోపించారు. ఉద్దేశ పూర్వకంగానే తెలుగుదేశం కార్యకర్తలలో అయోమయం సృష్టించేందుకు ఇష్టాను సారంగా లీకులు ఇవ్వడం బాధాకరమని, ఇప్పటికే తన సహచర మంత్రి గంటా శ్రీనివాసరావుపై కూడా అసత్యకథనాలు ప్రసారం చేస్తున్న విషయాన్ని గుర్తించాలని, తను టీడీపీ తరఫున ఆచంట నుంచి పోటీ చేస్తున్నానని, ఇందులో మరొక నిర్నజయం లేదని పీతాని తేల్చిచెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa