ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్1 పరీక్షను మే26కి వాయిదా వేస్తున్నట్టు ఏపీపీఎస్సీ తెలియజేసింది. వేలాది మంది అభ్యర్ధుల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొంది. అతి తక్కు వసమయంలో మెయిన్స్ పరీక్ష ఏర్పాటు చేయడం వలన చాలామంది క్వాలిఫై కూడా అయ్యే పరిస్థితి ఉండదని అభ్యర్ధులు తమ వినతిలో తెలియజేసినందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు కూడా ఉండటం కూడా అభ్యర్ధులకి కలిసి వచ్చింది. దీంతో వేలాది మంది అభ్యర్ధులకు మెయిన్స్ కి ప్రిపేర్ కావడానికి చాలా సమయం దొరికినట్టు అయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa